Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య కుటుంబం

Advertiesment
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య కుటుంబం
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:30 IST)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లి లో సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్ ల‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్, వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

 
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్బుతమని, ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని ఉషా వెంక‌య్య ఆకాక్షించారు. అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.
 
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని దీపావెంకట్  తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు... క్లాస్ కు 20 మంది మాత్ర‌మే!