Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు పాజిటివ్

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:06 IST)
Journalist
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. అలాగే కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది.

ముంబైలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. 167 మంది జర్నలిస్టుల శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్టులు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
53 మందిలో పలు వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు, కెమెరామెన్‌లు కూడా ఉన్నారు. ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

మరోవైపు చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. మధ్యప్రదేశ్‌లో కూడా ఓ జర్నలిస్ట్‌కు కరోనా సోకిన నేపథ్యంలో జర్నలిస్ట్‌లకు కరోనా సోకడం చాలా దురదృష్టకరం అని భారత ప్రభుత్వం తెలిపింది.
 
జర్నలిస్ట్‌లు ఉన్న ప్రొటోకాల్స్ ఫాలో అవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. డ్యూటీకి హాజరైనప్పుడు జర్నలిస్ట్ లు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఫేస్ మాస్క్ నిబంధనలు పాటించాలని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments