Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెట్ స్పీడ్ వేగతంతో కరనా వైరస్ వ్యాప్తి : 24 గంటల్లో 1533 కేసులు

Advertiesment
జెట్ స్పీడ్ వేగతంతో కరనా వైరస్ వ్యాప్తి : 24 గంటల్లో 1533 కేసులు
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ జెట్ స్పీడ్ వేగంతో వ్యాపిస్తోంది. దీనికి నిదర్శనమే గత 24 గంటల్లో ఏకంగా 1533 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,265కు చేరాయి. అలాగే, ఆదివారం ఒక్క రోజే కరోనా వైరస్ బారినపడి ఏకంగా 36 మంది చనిపోయారు. దీంతో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 559కు చేరింది. అలాగే, ఇప్పటివరకు 2,546 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,65,071కు చేరాయి. 
 
కాగా, కోవిడ్‌కు కేంద్రంగా మారిన మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు 4,203 కేసులు నమోదు కాగా, 223 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 507 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 2,003 మంది కరోనాతో బాధపడుతుండగా 45 మంది మృతి చెందారు. 
 
కరోనా హాట్‌స్పాట్... తుగ్లకాబాద్ 
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఓ మత సమ్మేళనం అని తేలిది. ఈ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ఈ వైరస్ సోకింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వారంతా తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించినట్టు తేలింది. 
 
అయితే, ఢిల్లీలో ఈ కరోనా కేసులు విపరీత సంఖ్యలో నమోదు కావడానికి మర్కజ్ మత సమ్మేళనమేనని తేలింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించి, సీజ్ చేసింది. ఇపుడు మరో అతిపెద్ద హాట్‌స్పాట్ ఒకటి బయటపడింది. 
 
దక్షిణ ఢిల్లీ పరిధిలోని తుగ్లకాబాద్, ఇప్పుడు దేశ రాజధానిలో మూడో అతిపెద్ద హాట్ స్పాట్‌గా అవతరించింది. తాజాగా ఇక్కడ 38 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ కావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. 
 
నిజానికి తొలుత ఇక్కడ ముగ్గురికి వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి నిత్యావసరాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. ఆపై ఈ ప్రాంతంలోని 94 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా, 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
 
దీంతో తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలనూ సేకరించి, వారిని క్వారంటైన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
 
కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్‌గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్‌గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తండ్రి ఆరోగ్యం విషమం