Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు

Advertiesment
తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ సోకి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్దూరు మండలంలోని నారాయణపేటకు చెందిన రెండేళ్ళ బాలుడు న్యూమోనియాతో బాధపడుతుంటే నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తూ రాగా, ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతని తండ్రి ద్వారానే బాలుడికి కరోనా వైరస్ సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులకు కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ ఆలోచనతో స్వయం సహాయక మహిళలకు ఉపాథి