దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో భారత్‌లో 1553 కొత్త కేసులు; 36 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లాక్‌డౌన్ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. గోవాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు లేవని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు.
కరోనా వైరస్ కేసులు రెట్టింపు లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5గా ఉందన్నారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 2546మంది రికవరీ/ డిశ్చార్జి కాగా దీని రేటు 14.75శాతంగా ఉందని చెప్పారు.