Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:01 IST)
న్యూఢిల్లీలో కరోనా వైరస్ మరణమృదంగాన్నే మోగిస్తోంది. దక్షిణ ఢిల్లీ పరిధిలోని తుగ్లకాబాద్, ఇప్పుడు దేశ రాజధానిలో మూడో అతిపెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది.

తాజాగా ఇక్కడ 38 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. తొలుత ఇక్కడ ముగ్గురికి వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి నిత్యావసరాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు.

ఆపై ఈ ప్రాంతంలోని 94 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా, 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలనూ సేకరించి, వారిని క్వారంటైన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments