Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్య : 16 మంది మృతి

Webdunia
బుధవారం, 1 మే 2019 (15:14 IST)
మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌తో పాటు 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 
 
బుధవారం మధ్యాహ్నం గడ్చిరోలికి బలగాల కాన్వాయ్ వెళుతుండగా, మావోయిస్టులు ఈఐడీ పేల్చారు. ఈ  పేలుడు ధాటికి భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన తునాతునకలైపోయింది. రోడ్డు మధ్యలో భారీ గొయ్యి కూడా ఏర్పడింది. ఈ దాడి అనంతరం మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే, ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుపారు.  
 
ఈ దాడికి ముందు పురాందా - మాలేగావ్ - యెర్కడ్ జాతీయ రహదారిని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన 36 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పది కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టంవాటిల్లింది. బుధవారం మహారాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments