Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిన్ అందక 11 మంది మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (08:49 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడుతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ కారణంగా ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. 
 
తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే మరణాలు సంభవించినట్టు గుర్తించారు. దీంతో లోపం ఎక్కడ జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. 
 
అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఇలా ఆక్సిజన్‌ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ముందే దేశంలో కరోనా మహహ్మారి బారిన పడి ప్రాణాల్పోతుంటే ఇలా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments