Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిటివి దినకరన్‌కు తమిళ ఓటర్లు చాచిపెట్టి లెంపకాయ, ఒక్క సీటు వస్తే ఒట్టు

Advertiesment
టిటివి దినకరన్‌కు తమిళ ఓటర్లు చాచిపెట్టి లెంపకాయ, ఒక్క సీటు వస్తే ఒట్టు
, సోమవారం, 3 మే 2021 (15:05 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
తమిళనాడులో దినకరన్ పేరు చెబితే తెలియనివారు వుండరు. శశికళ మేనల్లుడయిన దినకరన్ అన్నాడీఎంకె పార్టీ తమదేనంటూ కొన్నాళ్లు యాగీ చేసారు. ఆ తర్వాత జయలలిత చనిపోవడంతో ఆమె పోటీ చేసిన ఆర్కే నగర్‌లో పోటీ చేసి విజయం సాధించాడు. ఇక అక్కడ్నుంచి 2021 ఎన్నికల్లో చక్రం తిప్పుతామంటూ చెప్పుకొచ్చిన దినకరన్ కు ఈ ఎన్నికల్లో తమిళ ఓటర్లు చాచిపెట్టి లెంపకాయ ఇచ్చేసినంత పని చేసారు.
 
దినకరన్ సింగిల్ సీటు సాధించలేకపోయాడు, విచిత్రం ఏంటంటే, గత దశాబ్ద కాలం తర్వాత బిజెపి 4 సీట్లు గెలిచింది. డిఎంకె, ఎఐఎడిఎంకె నేతృత్వంలోని రెండు ప్రత్యర్థి కూటముల పోటీతో దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్రా కగం (ఎఎంఎంకె) పార్టీ కనుమరుగైపోయింది.
 
పార్టీ వ్యవస్థాపకుడు టిటివి దినకరన్ కూడా ఓడిపోయారు. కోవిల్పట్టి నియోజకవర్గం నుండి ఎంతో ఆర్భాటంగా పోటీ చేసినా అక్కడ ఆయనను ఓటర్లు తిరస్కరించారు. ఆదివారం ప్రకటించిన ఫలితాలు దినకరన్ భవిష్యత్ రాజకీయ ఆశయాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచాయి. ఇక ఈ దెబ్బతో అటు శశికళ, ఇటు దినకరన్ రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతారో లేదంటే అన్నాడీఎంకెలో చేరుతారో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాటుకు మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత