రాహుల్ గాంధీ నామినేషన్‌పై ఉత్కంఠతకు తెర

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:09 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్‌పై  నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. అమేథీ లోక్‌సభ స్థానంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 
 
17వ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయినాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్‌లో రాహుల్ గాంధీ తన పౌరసత్వాన్ని తప్పుగా చూపించారనీ, ఆయనకు బ్రిటీష్ పౌరసత్వం ఉందని పేర్కొంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌లాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో ఆయన నామినేషన్ పత్రాన్ని గత వారంలో ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. అయితే సోమవారం ఈ నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నిక సంఘం ధ్రువ్‌లాల్ ఆరోపణలను తోసిపుచ్చుతూ రాహుల్ నామినేషన్‌కు ఓకే చెప్పింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments