Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద శాతం కాదు వెయ్యి శాతం గెలుస్తున్నాం: చంద్రబాబు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:58 IST)
శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వంద శాతం కాదు.. వెయ్యి శాతం గెలుస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామన్నారు. మన కోసం క్యూలో ఉండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని సూచించారు. 'మీరు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి.. ప్రజల అవసరాలు తీర్చండి..' అని ఆదేశించారు. 
 
అంతేకాకుండా, తన రాజకీయ చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నని ఆయన వాపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయమన్నారు. జూన్‌ 8వ తేదీ దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించిన బాబు.. ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments