Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు వెన్నులో వణుకు... ఎమ్మెల్యే - ఎంపీ అభ్యర్థులకు ఆహ్వానం

Advertiesment
చంద్రబాబు వెన్నులో వణుకు... ఎమ్మెల్యే - ఎంపీ అభ్యర్థులకు ఆహ్వానం
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (17:28 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం మరో నెల రోజులకు పైగా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశాన్ని మాత్రం ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ దఫా ముక్కోణపు పోటీ నెలకొనగా, పోటీ మాత్రం చాలా టఫ్‌గా ఉంది. 
 
అదేసమయంలో వైకాపా మాత్రం అపుడే మైండ్‌ గైమ్ ఆరంభించింది. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఢంకాబజాయించి చెపుతోంది. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. అదేసమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మేల్కొన్నారు. ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. 
 
తాజాగా, టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అనంతరం, అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు.
 
అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని భేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈనెల 22న రాజధానిలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 23న విడుద‌ల కానున్న మెయ్‌జు 16ఎస్ స్మార్ట్‌ఫోన్