రాహుల్‌ గాంధీ ట్రాన్స్‌లేటర్‌.. నవ్వు ఆపుకోలేరు

గురువారం, 18 ఏప్రియల్ 2019 (12:15 IST)
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో పర్యటించారు. తిరువనంతపురంలోని పథనంథిట్ట, అలప్పుళా ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం చేపట్టిన రాహుల్ గాంధీకి తన ట్రాన్స్‌లేటర్‌తో కొంత సాంకేతిక సమస్య ఎదురైంది. 
 
ఈ ప్రచారంలో రాహుల్ గాంధీ ఇంగ్లీషులో ప్రసంగించారు. ఆయనకు రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్‌ గాంధీ చెప్పిన మాటలను కురియన్‌ మలయాళంలోకి అనువదించాలి. సరిగ్గా రాహుల్‌ వ్యాఖ్యలను ట్రాన్స్‌లేట్‌ చేయలేకపోగా.. ఏమన్నారో వినబడలేదు మళ్లీ చెప్పమని రాహుల్‌ గాంధీనే అడిగారు. 
 
ఈ వీడియోని చూసినవారందరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ప్రచారానికి సంబంధించిన ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేయడం గమనార్హం. కురియన్‌, రాహుల్‌ ఇబ్బంది పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అప్పుడెప్పుడో నువ్వు నేను చిత్రంలో ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్ఎస్ నారాయణ మధ్య నడిచే అనువాద హాస్యాన్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎన్నికల్లో గెలిపిస్తే మద్యంపై 50 శాతం రాయితీ...