ఇకపై ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్.. షాకిచ్చిన వాట్సాప్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (14:09 IST)
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వీడియోలు, వీడియో, ఆడియో కాల్స్ చేసేందుకు, సందేశాలను షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌ను భారీ స్థాయిలో నెటిజన్లు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2020 సంవత్సరం, ఫిబ్రవరి నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలను బంద్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 
 
సుదీర్ఘ కాలంగా వాట్సాప్ సేవలు కొనసాగించే దిశగా.. కొత్త అప్‌డేట్‌లను పొందుపరిచేందుకు గాను, ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లలో ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ బంద్ కానుందని వాట్సాప్ ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ ఐఓఎస్ 8లో పనిచేసే ఐఫోన్లలో, ఆండ్రాయిడ్ 2.3.7 వెర్షన్‌లో పనిచేసే ఫోన్లలో వాట్సాప్ ఇక బంద్ కానుంది. 
 
ప్రస్తుతానికి ఐఫోన్ ఐఓఎస్ 8, ఆండ్రాయిడ్ 2.3.7 వెర్షన్‌లలో వాట్సాప్ పనిచేస్తోంది. ఫిబ్రవరి 1, 2020 నుంచి వాట్సాప్ సేవలు ఈ ఫోన్లలో వుండవు. అందుచేత ఈ వెర్షన్‌లో పనిచేసే ఫోన్లను ఐఓఎస్ 9కు మార్పిడి చేసుకోవాల్సిందిగా వాట్సాప్ యూజర్లను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments