పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు అందించనుంది.. పంజాబ్ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ రాష్ట్రంలో అమ్రీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్‌లను అందించే పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఆర్థిక సంవత్సరం.. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12వ తరగతుల్లోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లను ఉచితంగా ఇచ్చే పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ప్రకారం తొలి విడతగా డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11, 12వ తరగతుల్లో చదివే విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారికి ఉచిత ఫోన్లను అందించనున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.