భార్యను చితకబాది.. కుమార్తెను రేప్ చేసిన కిరాతక తండ్రి

గురువారం, 22 ఆగస్టు 2019 (14:08 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి కిరాతకుడిగా మారిపోయాడు. కట్టుకున్న భార్యను చితకబాది కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుర్‌బచ్చన్‌ అనే వ్యక్తికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిస అయిన గుర్‌బచ్చన్ ప్రతిరోజూ ఇంటికి వచ్చి భార్యాకుమార్తెలను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మద్యం మత్తులో కుమార్తెపై కన్నేసిన కామాంధుడు... పలుమార్లు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా, ఆ యువతి అతని కబంధ హస్తాల నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయితే, ఈసారి భార్యను తీవ్రంగా చితకబాది గదిలో నుంచి బయటకు పంపించి.. కుమార్తెను మాత్రం పడక గదిలోనే బంధించాడు. 
 
ఆ తర్వాత తలకెక్కిన మద్యంమత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని తప్పించుకునేందుకు ఆ యువతి ఆర్తనాదాలు చేసినా, కన్నతల్లి ఏం చేయలేక నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. అయితే, ఆ యువతి కేకలు విన్న ఇరుగుపొరుగువారు గుమికూడారు. వారిలో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఆ తర్వాత తలుపులు పగులగొట్టి యువతిని రక్షించి, గుర్‌బచ్చన్‌ను పట్టుకుని చితకబాదారు. ఇంతలో పోలీసులు రావడంతో వారికి అప్పగించారు. ఆ తర్వాత బాధిత బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య పోలీసులను డిమాండ్‌ చేసింది. ఇలాంటి భర్తతో తాను ఉండలేనని, వితంతువుగా ఉండడం ఉత్తమమని ఆమె బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు