108 ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్.. షియోమీ అదుర్స్

శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:15 IST)
స్మార్ట్ ఫోన్లలో 48 మెగాపిక్సల్ కెమెరాను మాత్రమే చూశాం. కానీ ఆ సీన్ ఇక మారనుంది. త్వరలో శాంసంగ్ 64ఎంపీ కెమెరాతో షియోమి రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి.

48 ఎంపీ కెమెరాతో ఇప్పటికే ట్రెండ్‌ సెట్‌ చేసిన షియోమి ఇప్పుడు 100 లేక 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ ఫోను 12032×9024 రిజల్యూషన్‌ కలిగివుంటుంది. 
 
ఇదివరకే షియోమీ తన సంస్థ నుంచి రెడ్‌మీ నోట్ ప్రోతో 48 ఎంపీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాగా,  గతనెలలో 64 ఎంపీ కెమెరా కలిగిన ఫోన్‌కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక అంతటితో ఆగకుండా ఏకంగా 108 ఎంపీల కెమెరా కలిగిన ఫోన్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 
 
ఇందులో భాగంగా మార్కెట్లోకి 108 ఎంపీ కెమెరా వుండే స్మార్ట్ ఫోన్లను షియోమి మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇప్పటికే సామ్‌సంగ్ 108 ఎంపీ ఇసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్ కెమెరా సెన్సార్‌ను స్మార్ట్‌ఫోన్లను వాడుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే, 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శబరిమల ఆలయ నిర్వాహణకు ప్రత్యేక చట్టం.. మహిళా యాత్రికులకు?