దేశంలోనే భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు.. అలాంటి వీడియోలతో బ్లాక్ మెయిల్.. వీఐపీలే..?

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:56 IST)
రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులను టార్గెట్ చేస్తూ సెక్స్ స్కాండల్ నిర్వహిస్తూ వచ్చిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ భారీ సెక్స్ స్కాండల్‌  బయటపడింది. దాదాపు 35మందికి పైగా కాల్ గర్ల్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం, గవర్నర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వలపు వల వేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇందులో భాగంగా 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ భారీ బ్లాక్‌మెయిల్ స్కాండల్.. శ్వేత స్వప్నైల్ జైన్ అనే మహిళ నేతృత్వంలో నడుస్తోందని పోలీసులు తెలిపారు. 
 
బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేసిందని వారు వెల్లడించారు. పక్కా ప్లాన్‌తో రాజకీయ నేతలకు వలవేసి.. వారి లొంగిపోయాక కాల్ గర్ల్స్‌తో శృంగారంలో పాల్గొంటుండగానే.. ముందే ఏర్పాటు చేసిన కెమెరాతో వీడియోలు తీసేది. ఆపై ఆ వీడియోలతో బెదిరించేది. ఇలా ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా దక్కించుకుంది. దీనికి శ్వేత భర్త స్వప్నిల్ జైన్ కూడా సాయపడ్డట్లు పోలీసులు గుర్తించారు.
 
వీరి వలలో పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్ వేదికగా ఏళ్లుగా ఈ కుంభకోణం నడుస్తోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు. 20 శాతం కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతలు ఉన్నా వారిని అరెస్టు చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎదురింటి యువకుడితో భార్య ఎఫైర్... విషయం భర్తకు తెలిసిందని?