పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:21 IST)
పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. పైగా, ఈ భూకంపం కారణంగా ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలు కంపించి పోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. 
 
కాగా, పాక్‌లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీరులో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు స్థానికుల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ‘ ఔను, అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ అంగీకారం