Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ గ్రౌండ్‌లో రిషబ్‌ పంత్‌కు ఐ లవ్ యూ చెప్పిందెవరో తెలుసా? (video)

Advertiesment
క్రికెట్ గ్రౌండ్‌లో రిషబ్‌ పంత్‌కు ఐ లవ్ యూ చెప్పిందెవరో తెలుసా? (video)
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:36 IST)
క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ మహిళా అభిమాని ఐ లవ్ యూ చెప్పింది. అంతే ఆ క్రికెటర్ షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. మన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌కు ముందు ఆ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇక ప్రాక్టీస్‌కు మధ్యలో రిషబ్ పంత్ క్రికెట్ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌ వద్దకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ యువతి ఉన్నట్టుండి.. రిషబ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. 
 
అయితే రిషబ్ సమాధానమివ్వకుండా.. ఆటోగ్రాఫ్ మాత్రం ఇచ్చి.. కామ్‌గా వుండిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓవర్ స్పీడ్.. షేన్‌వార్న్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం