ఎదురింటి యువకుడితో భార్య ఎఫైర్... విషయం భర్తకు తెలిసిందని?

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:50 IST)
హైదరాబాద్ లోని పంజాగుట్ట ఏరియా. ఆరు నెలల క్రితం రామచంద్రవర్మ, సోనికలకు వివాహమైంది. రామచంద్ర రైల్వే ఉద్యోగి. పెళ్ళయిన తరువాత పంజాగుట్టలోని ఒక అపార్ట్‌మెంట్లో ఇద్దరూ నివాసముండేవారు. ఇంటి ఎదురుగా రాజేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒంటరిగా ఉండేవాడు. రామచంద్ర, సోనికల కుటుంబానికి రాజేష్ బాగా దగ్గరయ్యాడు.
 
ఆ చనువు కాస్తా సోనికతో వివాహేతర సంబంధానికి దారితీసింది. రామచంద్ర ఉద్యోగానికి వెళ్లగానే రాజేష్, సోనికతో గడుపుతుండేవాడు. విషయం కాస్తా వారం రోజలు క్రితం భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు. భర్త దగ్గర దొరకని సుఖం రాజేష్ దగ్గర దొరకడంతో భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది సోనిక. 
 
నిద్రపోతున్న రామచంద్రవర్మను దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత శవం కనిపించకుండా పూడ్చేసింది. రామచంద్ర వర్మ కనిపించకుండా పోయాడన్న విషయాన్ని అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా రాజేష్ ఇచ్చిన సమాచారంతో సోనికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భార్య కాపురానికి రాలేదని మెడ చుట్టూ బాంబులు కట్టుకున్న భర్త..