Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?

Advertiesment
తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:37 IST)
కేరళలో తండ్రి అనుమతితో.. అతడి స్నేహితులు 30 మంది 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం, సెల్లేరి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక.. వరుసగా స్కూలుకు సెలవులు పెట్టేది.
 
దీన్ని గమనించిన బాలిక క్లాస్ టీచర్.. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆపై ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు పాఠశాల యాజమాన్యంతో పాటు శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఆ సందర్భంగా ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. 
 
గత రెండేళ్ల పాటు ఆ విద్యార్థినిపై తండ్రితో పాటు అతడి స్నేహితులు చాలామంది లైంగికంగా దాడి చేశారని తెలియవచ్చింది. పాఠశాల సెలవుల సందర్భంగా ఆ బాలిక ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య అధికమని తెలిసింది. 
 
దాదాపు 30 ఏళ్ల దాటిన వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్కో చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేశారు. బాధితురాలిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేణుమాధవ్‌పై అలాంటి ప్రచారం ఆపండి.. నేను చూసొచ్చాను.. జబర్దస్త్ రాకేష్