Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

పెళ్ళయి నెలరోజులే.. భర్త స్నేహితుడితో ఎఫైర్..

Advertiesment
Affair
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (18:32 IST)
ఒక వివాహిత చేసిన తప్పు చివరకు తన నిండు జీవితం నాశనం అయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తను పోగొట్టుకుంది. చివరకు ప్రియుడిని దూరం చేసుకుని.. మనోవేదనతో అతడిని దారుణంగా హత్య చేసి కటాకటాల పాలైంది.
 
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతమది. కొత్తగా వివాహమైన జంట. అందమైన లోకంలో విహరిస్తున్నారు. పెళ్ళయిన 15 రోజుల తరువాత భర్త ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాడు. భర్త విశ్వ క్లోజ్ ఫ్రెండ్ జీవన్. విశ్వకు మోటార్ సైకిల్ లేకపోవడంతో ఇద్దరూ కలిసి ఒకే బైకు పైన ఉద్యోగానికి వెళ్ళేవారు.
 
విశ్వకు పెళ్ళి కాకముందు స్నేహితులిద్దరూ ఒకే గదిలో కలిసి ఉండేవారు. పెళ్ళయిన తరువాత కూడా జీవన్ విశ్వను డ్రాప్ చేసేవాడు. ఎప్పుడూ ఇంటి బయట నుంచి విశ్వను పికప్ చేసుకుని ఆ తరువాత బయటే వదిలి వెళ్ళేపోయేవాడు. అయితే ఒకరోజు విశ్వ, వాష్ రూమ్‌లో ఉండటంతో ఫోన్ తీయలేకపోయాడు. 
 
దీంతో జీవన్ నేరుగా అతని ఇంటి లోపలికి వెళ్ళాడు. విశ్వ భార్య స్వప్నను చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది. ఇంతలో విశ్వ, వాష్ రూం నుంచి బయటకు వచ్చాడు. నా భార్య స్వప్న అంటూ పరిచయం చేశాడు. జీవన్ ఆమెపై కన్నేశాడు. మొదటి చూపులోనే స్వప్న కూడా జీవన్‌ను కన్నార్పకుండా అలాగే చూసేసింది.
 
అలాఅలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. రెండుమూడురోజుల పాటు స్వప్న ఇంటిలోనే విశ్వ లేని సమయంలో ఇద్దరు కలిశారు. ఐతే ఈ విషయం కాస్తా విశ్వకు తెలిసిపోయింది. స్వప్నకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. సమాజంలో ఇలాంటివి చేస్తే తలెత్తుకు తిరగలేమని భార్యకు నచ్చజెప్పాడు. భర్త మాటల్లో నిజాన్ని గమనించి చేసిన తప్పును తెలుసుకుంది.
 
అయితే జీవన్‌తో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు విశ్వ. స్వప్న తనను దూరం చేస్తూ వస్తుండటంతో జీవన్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన శారీరక సంబంధానికి విశ్వ అడ్డొస్తున్నాడని... విశ్వతో కలిసి పూటుగా మద్యం సేవించి అతడు మత్తులోకి జారుకోగానే హత్య చేశాడు. మృతదేహం కనిపించకుండా పూడ్చేశాడు. తన భర్త కనిపించలేదని స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు.
 
ఐతే తన భర్తను జీవన్ చంపేసి ఉంటాడని అనుమానించింది స్వప్న. దాంతో అతడితో మాటలు కలిపి తెలివిగా కూపీ లాగింది. అతడి మాటలను బట్టి విశ్వను హత్య చేసింది అతడేనని నిర్థారించుకుంది. ఇక ఎలాగైనా అతడిని చంపేయాలనుకుని నిర్ణయించుకుంది. కలుద్దామని ఇంటికి రమ్మని చెప్పింది. అతడు రాగానే బాగా పీకల దాకా మద్యం తాగించింది. 
 
అతడు మత్తులోకి జారుకోగానే కారులో అతడిని ఉప్పల్ ఏరియాలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆ తరువాత అతడికి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అతడు చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయింది. భర్త విశ్వ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జీవన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం