ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పంపిన సమాచారంలో తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తోంది. అది కనుక అందుబాటులోకి వస్తే పంపిన సమాచారంలోని తప్పొప్పులను సరిచేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ మూడు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకునిరావాలని ట్విటర్ యాజమాన్యం భావిస్తోంది. ట్విట్టర్‌లో ఎడిట్ ఫీచర్‌లానే ఇది కూడా పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం యూజర్లు ఏదైనా సమాచారాన్ని పంపిన తర్వాత అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. మరో కొత్త మెసేజ్ పంపడమో, లేదంటే పాత మెసేజ్‌ను డిలీట్ చేసి కొత్త దానిని పంపడమో చేయాల్సి వస్తోంది. అయితే, ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆ తిప్పలు తప్పినట్టే. అయితే, 15 నిమిషాల్లోపే ఎడిట్ చేసుకునే వెసులుబాటు వుంది. ఆ సమయం మించిపోతే మాత్రం ఎడిట్ చేయడం వీలుపడదు.
ప్రస్తుతం అభివృద్ధి, ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్‌తోపాటు మరో అప్‌డేట్‌ను కూడా తీసుకొస్తోంది. వాట్సాప్‌లోని గ్రూప్ సభ్యుల సంఖ్యను 1024కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ సంఖ్య 512గా ఉంది.