Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త

Advertiesment
hyderabad metro
మెట్రో రైల్ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై వాట్సాప్‌ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చని హెచ్.ఎం.ఆర్.ఎల్ అధికారులు సోమవారం వెల్లడించారు. 
 
ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల ఇకపై టిక్కెట్ల కోసం ప్రయాణికులు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. 
 
వాట్సప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం బిల్‌ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
 
మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న క్యూర్‌ కోడ్‌ను వాట్సాప్‌ ద్వారా స్కాన్‌ చేసి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఈ టిక్కెట్లను మొబైల్ నంబరుతో 8341146468 అనే నంబరుకు హాయ్ అని ఒక సందేశాన్ని పంపింతే.. ఓటీపీ నంబరు వస్తుంది. 
 
దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రయాణించాల్సిన గమ్యస్థానం పేరును నమోదు చేశాలి. ఆ తర్వాత ఈ టిక్కెట్ ధరను డిజిటల్ రూపంలో చెల్లించిన తర్వాత ఈ-టిక్కెట్ వస్తుంది. ఆ టిక్కెట్‌పై ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు