Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

hyderabad metro
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (20:06 IST)
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైల్ సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని నిర్ణయించింది. 
 
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో సిటీ బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో మెట్రో రైల్ సర్వీసులు నడపాలని హెచ్ఎంఆర్‌సీ నిర్ణయించింది. ఈ రైళ్లను కూడా క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచే అవకాశం ఉందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావోద్వేగాలతో ముడిపడిన అంశం : 'ఎన్టీఆర్' పేరు మార్పుపై కళ్యాణ్ రామ్