Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంటిలేటర్ ఊచలు తొలగించి అర్థరాత్రి మొబైల్ షోరూమ్‌లో చోరీ

mobile phone stolen
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (10:33 IST)
హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో వెంటిలేటర్ ఇనుప ఊచలు తొలగించిన దుండగులు షోరూమ్‌లోకి వెళ్లి భారీ చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.70 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను చోరీ చేశారు. ఈ చోరీ జరిగిన షోరూమ్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరం అంటే కవలం 100 అడుగుల దూరంలో ఉండటంతో ఇపుడు అనుమానాలకు తావిస్తుంది. పైగా, ఈ చోరీకి పాల్పడింది మాత్రం ఒక్కడేనని పోలీసులు చెబుతున్నాడు. తలకు రుమాలు కట్టుకున్న దుండగుడు షోరూమ్‌లోకి వెంటేలటర్ రంధ్రం కూడా వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. 
 
ఈసీఐఎల్ కూడలిలో గత ఐదేళ్లుగా ఈ షోరూమ్ ఉంది బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు చోరీ జరిగింది. షోరూంకు, ఎడమ వైపు భవనానికి మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలు, ఫాల్‌ సీలింగ్‌ను తొలగించి దొంగ భవనంలోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు తెంపేశాడు. 
 
200కు పైగా ఐఫోన్‌, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ చరవాణులు తీసుకుని.. వాటి డబ్బాలు అక్కడే వదిలేసి పారిపోయాడు. వీటి విలువ సుమారు రూ.70 లక్షలపైనే. ఇతర లాప్‌లాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని ముట్టుకోలేదు. బుధవారం ఉదయం షోరూం తెరిచిన తర్వాత చోరీ విషయం గమనించిన సంస్థ జనరల్‌ మేనేజర్‌ మహ్మద్‌ హబీబ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలు సేకరించారు. లోపల ఉన్న సీసీ ఫుటేజీల్లో ఒక్కరు మాత్రమే కనిపించాడు. అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షోరూంను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌, డీసీపీ రక్షితామూర్తి, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురవారెడ్డి, ఎస్‌ఐ మదన్‌లాల్‌ పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు కుబేరులు ఎవరు? టాప్-10 కుబేరులు వీరే