ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాత వాట్సాప్ వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇలాంటి ఓ సెక్యూరిటీ బగ్‌నే ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ ఇన్) గుర్తించింది. ఈ బగ్‌ను తీవ్రమైనదిగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో నోడల్ ఏజెన్సీగా సీఈఆర్టీ ఇన్ పని చేస్తుంది. వాట్సాప్‌లోని ఓ బగ్‌ను ఇది గుర్తించింది. వాట్సాప్ వీ2.22.16.12 వెర్షన్ వినియోగిస్తున్న వారు ఈ సెక్యూరిటీ బగ్‌కు ప్రభావితమవుతారని, అందువల్ల సీఈఆర్టీ ఇన్ పేర్కొంది. అందువల్ల ఆ వెర్షన్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లను ఓ హెచ్చరిక చేసింది. వాట్సాప్ కూడా ఈ సమాచారాన్ని చేరవసింది.
అందువల్ల పాత వాట్సాప్ వెర్షన్ వాడుతున్నవారు తక్షణం కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పాత వెర్షన్ వాడుతున్న వారందరూ కొత్త వెర్షన్ మారాలని తెలిపింది. దీంతో ఈ బగ్స్ బారి నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది. కొత్త వెర్షన్ యాప్‌లో వాట్సాప్ ఈ సమస్యలను ఫిక్స్ చేసినట్టు పేర్కొంది.