Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉక్రెయిన్ మెడికోలకు దేశంలో సీట్లు కేటాయించలేం : కేంద్రం స్పష్టీకరణ

Russia-Ukraine war
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (07:50 IST)
ఉక్రెయిన్ చదువుకుంటూ రష్యా దండయాత్ర కారణంగా స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్లు కేటాయించలేమని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో తెలిపింది. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న వారు కూడా మన దేశంలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, వారు ఇక్కడ సీట్లు సాధించడంలో విఫలమైన తర్వాతే ఉక్రెయిన్‌లో చేరారని, అందువల్ల వారికి సీట్లు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
 
ఉక్రెయిన్ దేశంపై రష్యా గత ఫిబ్రవరి నెలలో దండయాత్ర మొదలుపెట్టింది. దీంతో ఆ దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో వైద్య  విద్యను అభ్యసిస్తున్న వారంతా తమ విద్యను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి స్వదేశానికి వచ్చారు. వీరికి స్వదేశంలోని వైద్య కాలేజీల్లో సీట్లు కేటాయించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న భార‌తీయ విద్యార్థుల‌కు మ‌న దేశంలోని వైద్య క‌ళాశాల‌ల్లో సీట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేమ‌ని స్పష్టం చేసింది. 
 
ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క అంశాన్ని త‌న అఫిడ‌విట్‌లో ప్ర‌స్తావించింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న వారంతా భార‌త్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేందుకు నీట్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యార‌ని కేంద్రం తెలిపింది. అయితే భార‌త్‌లో వారికి సీటు సాధించే స్థాయిలో ర్యాంకులు రాలేద‌ని తెలిపింది. 
 
ఇక్క‌డ సీట్లు రాని కార‌ణంగానే వారంతా ఉక్రెయిన్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో చేరార‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో మ‌న కాలేజీల్లో సీటు సంపాదించ‌లేని విద్యార్థుల‌కు ఇప్పుడు ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌ను కార‌ణంగా చూపి సీట్లు ఇవ్వ‌లేమ‌ని కేంద్రం తేల్చి చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో కోవూరులో గోల్డ్ ఫీల్డ్స్ వారి నూతన షోరూమ్ ప్రారంభం