Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరులో కోవూరులో గోల్డ్ ఫీల్డ్స్ వారి నూతన షోరూమ్ ప్రారంభం

JCB
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (23:32 IST)
ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరంగా భారతదేశంలో అగ్రశ్రేణి తయారీదారులుగా జెసిబి ఇండియా లిమిటెడ్ ఉంది. గోల్డ్ ఫీల్డ్స్ జెసిపి యొక్క నూతన షోరూమ్, ఇంటిగ్రేటెడ్ వర్క్ షాపు నెల్లూరులో ప్రారంభించబడినది. జెసిబి ఇండియా లిమిటెడ్ యొక్క వినూతనమైన ఉత్పత్తి జాబితాను అందించేటువంటి ఈ అత్యాధునిక కేంద్రం సాటిలేని ఉత్పత్తి, మద్దతు, అనుభవాలను నెల్లూరు, చుట్టూ పక్కల వినియోగదారులకు అందించనున్నారు. 
 
దాదాపు 14000 చదరపు అడుగుల విస్తీర్ణములో నిర్మించబడిన ఈ నూతన 3ఎస్ ఇంటిగ్రేటెడ్ కేంద్రములో దాదాపు 220 మంది ఉద్యోగులు విధులను నిర్వహించుచున్నారు. వీరిలో దాదాపు 10 శాతం మహిళలు. కస్టమర్స్ యొక్క అవసరాలకు అనుకూలంగా సేల్స్, సర్విస్, పార్ట్స్‌కు సంబంధించిన సేవలు అందించడానికి అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారు.
 
జెసిబి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దీపక్ శెట్టి మాట్లాడుతూ, గోల్డ్ ఫీల్డ్స్ జెసిబితో మా సుదీర్ఘ భాగస్వామ్యం 1998లో ప్రారంభమైనది. ఈ ప్రాంతంలోని మా వినియోగదారుల ప్రయోజనార్థం ఈ నూతన ప్రపంచ శ్రేణి కేంద్రాన్ని నేడు ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రతి ఒక్కరూ అధికంగా దృష్టి సారిoచడం వల్ల భవిష్యత్తులో మా ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ను చూడగలమని భావిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందంజలో ఉంటుంది. ఈ నూతన కేంద్రం మా నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా మా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాల సైతం అందించనుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరుతో పాటుగా అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో గోల్డ్ ఫీల్డ్స్ జెసిబి సేవలను అందిస్తుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సింపోజియం’ నిర్వహించిన ఏఎస్‌బీఎల్‌