Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఆదేశాలు చట్ట విరుద్ధం : ట్విట్టర్ సంచలన కామెంట్స్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (17:27 IST)
వివాదాస్పదంగా ఉన్న మొత్తం 1,178 ఖాతాలను తక్షణం ఆపివేయాలని, లేకుంటే అరెస్టు తప్పదని ట్విట్టర్‌ యాజమాన్యాన్ని కేంద్రం హెచ్చరించింది. దీనికి ట్విట్టర్ కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన ఆదేశాలు చట్ట విరుద్ధమని, ఈ ఖాతాలను భారత్‌లో మాత్రమే నిషేధించామని, మిగతా దేశాల్లో అందుబాటులోనే ఉంటాయని తన బ్లాగ్ పోస్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. 

పైగా, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆదేశాలను పూర్తిగా పాటించలేమని, వీటిని పూర్తిగా నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ సొంతమేనని, వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన ట్విట్టర్, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుందని గుర్తుచేసింది. 

'మాకు అందిన ఆదేశాలు భారత న్యాయ వ్యవస్థకు, చట్టాలకు అనుగుణంగా లేవని మేము భావిస్తున్నాము. ఈ ఖాతాలపై మేము పూర్తి చర్యలు తీసుకోలేము. వీటిల్లో మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఖాతాలు కూడా ఉన్నాయి. వీటిని నిషేధిస్తే, భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరించినట్టే. అది వారి ప్రాథమిక హక్కులో ఒకటన్నదే మా ఉద్దేశం' అని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments