Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో వచ్చి.. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందని అరుస్తున్నారు.. మంత్రి హరీష్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (16:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించకుండానే సుతిమెత్తగా విమర్శలు గుప్పించారు. 

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం రైతు వేదికను ప్రారంభించిన హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన కామెంట్స్ చేశారు. 

'ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు' అంటూ పరోక్షంగా షర్మిలకు హరీష్ రావు చురకలంటించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. 

ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో తన మద్దతుదారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, తనకు, అన్న జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments