సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఇండియా పాలసీ విభాగం అధినేత మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేశారు. కానీ, వచ్చేనెలలో పూర్తిగా బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనున్నారు. భారత్‌తోపాటు దక్షిణాసియా వ్యవహారాల పాలసీ విభాగం అధిపతిగానూ ఆమె కొనసాగారు. ఆమె రాజీనామాను ట్విట్టర్ యాజమాన్యం కూడా ధృవీకరించింది.
గత వారమే సంస్థ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఆమె స్థానాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వాణిజ్య ప్రకటనలు కూడా జారీచేసింది. కానీ, ఇంతలోనే ఆమె రాజీనామా చేయడానికి కారణం... ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల రైతుల ఆందోళనపై కొన్ని హ్యాండిల్స్ బ్లాకింగ్ అండ్ బ్లాకింగ్‌పై భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తరుణంలో ఆమె వైదొలగాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని ట్విట్టర్ ఖాతాల బ్లాకింగ్, ట్వీట్ల తొలగించి తిరిగి పునరుద్ధరించడంపై తలెత్తిన వివాదంపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించినా.. ఆమె రాజీనామాకు దీంతో సంబంధం లేదని ట్విట్టర్ వర్గాల కథనం.
వాస్తవానికి ఈ యేడాది ఆరంభంలోనే ఆమె తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారనీ, ట్విట్టర్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మొనిక్యూ మెచె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె రాజీనామా తమ సంస్థకు నష్టమేనని వెల్లడించారు.
మహిళ గత ఐదేళ్లకు పైగా సంస్థ పురోగతిలో కీలకమైన పాత్ర పోషించారన్నారు. అయితే, తన వ్యక్తిగత జీవితం, సంబంధాలు, ఇతర ముఖ్యమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయాలని మహిమా కౌల్ తీసుకున్ననిర్ణయాన్ని తమ సంస్థ గౌరవిస్తుందని మొనిక్యూ మెచె తెలిపారు.