సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు ఇండియాలో పాలసీ విభాగం అధినేతగా ఉన్న మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌తోపాటు దక్షిణాసియా వ్యవహారాల పాలసీ విభాగం అధిపతిగానూ కొనసాగిన మహిమ తన రాజీనామా విషయాన్ని శనివారం ధృవీకరించారు. కాగా, మార్చి చివర్లోగా ఆమె తన పదవి నుంచి పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
అలాగే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఉద్యమంపై ట్విటర్‌లో చర్చ కొనసాగుతుండటం, దేశానిని హాని చేసేలా విదేశీ శక్తులు కుట్రపన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఇటీవల రైతుల ఆందోళనపై కొన్ని హ్యాండిల్స్ కుట్రను ప్రేరేపిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం ఫిర్యాదు చేయడం తెలిసిందే.
గడిచిన మూడు వారాలుగా ట్విటర్ వేదికగా రైతు ఉద్యమం ఉధృతమవుతుండటం, అదే సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న సందర్భంలోనే మహిమా గిల్ వైదొలగాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహిమ రాజీనామాకు, రైతుల ఉద్యమంపై వివాదానికి సంబంధం లేదని ట్విట్టర్ వర్గాలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మహిమా కౌల్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మొనిక్యూ మెచె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె రాజీనామా తమ సంస్థకు నష్టమేనని పేర్కొన్నారు. ఐదేండ్లకు పైగా సంస్థ పురోగతిలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారన్నారని, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని మెచె పేర్కొన్నారు.