తెలంగాణ సీఎం పగ్గాలను ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి18న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని తెలిసింది. ఇంతలో కేసీఆర్ యాగాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం. ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.
కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తరువాత మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని తెలిసింది. పార్టీ అధినేతగా కేసీఆర్ కొనసాగనున్నారు.