Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ వైడ్ పాపులారిటీతో దూసుకెళుతున్న టిక్ టాక్ - ఎఫ్‌బీ మెసెంజర్ వెనక్కి

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (06:18 IST)
టిక్ టాక్.. దీని గురించి తెలియని వారుండరు. వీడియో షేరింగ్ యాప్. చైనాకు చెందిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన అనతికాలంలో మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే, ఈ యాప్ వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని భావించడంతో పలు దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించాయి. అయినప్పటకీ.. పేరు మార్చుకుని మళ్లీ వచ్చేందుకు నానా తంటాలు పడుతుంది. 
 
ఈ క్రమంలో డౌన్ లోడ్ల సంఖ్య పరంగా టిక్‌టాక్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ అయింది. గతేడాది అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా టిక్ టాక్ నిలిచింది. ఈ వీడియో షేరింగ్ యాప్ దెబ్బకు ఫేస్‌బుక్ మెసెంజర్ ఐదో స్థానానికి పడిపోయింది.
 
అత్యధిక డౌన్ లోడ్లు పొందిన గ్లోబల్ టాప్-5 యాప్‌లలో టిక్ టాక్ ఒక్కటే ఫేస్‌బుక్‌కు చెందనిది. మిగతా నాలుగు యాప్‌లు ఫేస్‌బుక్‌కు చెందినవే. అవి ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్. వీటన్నింటిని అధిగమించిన చైనీస్ యాప్ టిక్ టాక్ వరల్డ్ వైడ్ పాప్యులారిటీతో దూసుకుపోతోంది.
 
2019లో డౌన్ లోడ్ల పరంగా టిక్ టాక్ నాలుగోస్థానంలో ఉంది. ఏడాది కాలంలో శరవేగంగా పైకి ఎగబాకింది. టిక్ టాక్‌‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధించినప్పటికీ జోరు తగ్గకపోగా, మరింత ఎక్కువైంది. భారత్‌లోనూ టిక్ టాక్ నిషేధం ఎదుర్కొన్నప్పటికీ, పేరు మార్చుకుని తిరిగి వచ్చేందుకు ఆ యాప్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments