Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుకర్ బర్గ్ రెండో పాప పేరు ''ఆగస్ట్''.. ఉత్తరం రాశారు.. అందులో ఏముంది?

ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆ పాపకు ఆగస్ట్ అనే పేరు పెట్టారు. ఆగస్టులో పుట్టిన ఆ బిడ్డకు ఆగస్ట్ అని పేరు పెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జుకర్ రెండో పాపక

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (16:22 IST)
ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆ పాపకు ఆగస్ట్ అనే పేరు పెట్టారు. ఆగస్టులో పుట్టిన ఆ బిడ్డకు ఆగస్ట్ అని పేరు పెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జుకర్ రెండో పాపకు తొలి బిడ్డకు రాసినట్టే ఉత్తరం రాశాడు. "డియర్‌ ఆగస్ట్‌.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. నీ రాక కోసం మీ అమ్మా, నేను ఎంతో ఆత్రుగా ఎదురు చూశామని చెప్పారు. 
 
ఇక మీ అక్క మాక్స్‌ పుట్టినప్పుడు కూడా మేం ఇంతే ఆనందంగా ఉన్నాం. అప్పుడు కూడా ఇలానే ఉత్తరం రాశాం. నువ్వు  విద్య, బలమైన అనుబంధాలు, సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగాలని ఆశిస్తున్నాం. బాల్యదశను బాగా ఎంజాయ్ చెయ్. మీ ఇద్దరి భవిష్యత్తు తల్లిదండ్రులుగా మేం చూసుకుంటాం. 
 
ఈ శాస్త్రసాంకేతిక కాలంలో మీరు తమకంటే మంచి జీవితాన్ని అనుభవిస్తారని తెలుసు. కానీ దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మాపైనే ఉంది. బాల్యం చాలా అద్భుతమైనది. అది ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ఆ బాల్య ప్రాయాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి. మేం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామని ఉత్తరం రాశారు. 
 
ఇంకా ఆ లేఖలో.. నువ్వు మ్యాక్స్‌తో కలిసి పుస్తకాలు చదవాలి. ఇంట్లో ఆడుకోవాలి. నువ్వు చాలాసేపు నిద్రపోతావనుకుంటా. నీ కలలో మేమొస్తామని నమ్ముతున్నా. నీ భవిష్యత్తే కాదు.. నీ తరం చిన్నారులకు అత్యుత్తమ ప్రపంచాన్ని సృష్టిస్తాం. నీ జీవితం సంతోషకరంగా మారేందుకు నా అభినందనలు. నీవిచ్చిన సంతోషాన్ని మేము నీకు తిరిగిస్తామని జుకర్ బర్గ్ ఆ లేఖలో రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments