ఘంటసాల మనవరాలు ప్రేమ వివాహం ఫిక్స్ అయ్యింది..
విఖ్యాత గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు మనవరాలు వీణ ప్రేమ వివాహం చేసుకోనుంది. 'క్షణం' చిత్ర దర్శకుడు రవికాంత్‌ను ప్రేమ వివాహం చేసుకోనుంది. తన తండ్రి రత్నకుమార్ మాదిరిగానే డబ్బింగ్ ఆర్టిస్టుగా రా
విఖ్యాత గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు మనవరాలు వీణ ప్రేమ వివాహం కుదిరింది.
'క్షణం' చిత్ర దర్శకుడు రవికాంత్‌ను ప్రేమ వివాహం చేసుకోనుంది. తన తండ్రి రత్నకుమార్ మాదిరిగానే డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వీణ.. గతంలో రవికాంత్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆదాశర్మకు డబ్బింగ్ చెప్పింది.
ఆ సమయంలో రవికాంత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలూ ఈ పెళ్లికి అంగీకరించారు. చెన్నైలో వీరిద్దరి నిశ్చితార్థం జరుగగా, నవంబర్ 11న వివాహం వైభవంగా జరగనుంది.
ఘంటసాల తనయుడు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు అయిన ఘంటసాల రత్నకుమార్ కూతురు వీణ. ఆమె కూడా పలు చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.
క్షణం సినిమాలోనే రవికాంత్-వీణ మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం తన రెండో చిత్రం కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో రవికాంత్ పెరెపు బిజీగా ఉన్నాడు. రానా హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.