Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నబిడ్డను మూడో అంతస్తు నుంచి 2సార్లు తోసేసింది.. ఇంట్లోకి వెళ్ళి మేకప్‌తో బయటికొచ్చింది..

కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి

Advertiesment
కన్నబిడ్డను మూడో అంతస్తు నుంచి 2సార్లు తోసేసింది.. ఇంట్లోకి వెళ్ళి మేకప్‌తో బయటికొచ్చింది..
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:59 IST)
కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి అక్కడే నివాసం వుంటున్నారు. కాంచన్‌ సర్కార్‌ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్‌ అనలిస్టుగా పని చేస్తుండగా, అతని భార్య స్వాతి సర్కార్‌ ఓ పాఠశాలలో హిందీ టీచరుగా పని చేసేది. 
 
కానీ కొద్దికాలంలో స్వాతి మానసిక ప్రవర్తన బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసింది. ఇక భర్త కూడా కొద్దికాలంగా భార్యకు దూరంగా వుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవాడు. దీంతో స్వాతి సర్కార్ బుద్ధి మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం స్వాతి తన ఏడేళ్ల కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుపై నుంచి కిందకు తోసేసింది. 
 
శ్రేయ మూగ బాలిక కావడంతో కేకలు వేయలేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని స్వాతి మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేసింది. ఈ ఘటనలో శ్రేయా తీవ్రగాయాలతో మృతి చెందింది. ఆ తర్వాత స్వాతి ఏమీ తెలియనట్లుగా ఇంట్లోకి వెళ్లి మేకప్ వేసుకుని ముస్తాబై బయటికి వచ్చింది. 
 
కూతురి మృతదేహం ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తల్లిని స్థానికులు పట్టుకుని దేహశుధ్ది చేశారు. ఆపై ఆమెను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పుట్టెనహళ్లి పోలీసులు కుటుంబ కలహాలతోనే శ్రేయను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌కు 19మంది సపోర్ట్.. స్టాలిన్ చేతులు కలుపుతారా? కొత్త సర్కారు ఏర్పాటు?