Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఫేస్‌బుక్ చీఫ్ జుకర్ బర్గ్?

ప్రపంచంలోని సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ అగ్రగామి కాగా, ట్విట్టర్లు రెండో స్థానంలో వుంది. ఫేస్‌బుక్ కంటే ట్విట్టర్‌కు అంతగా క్రేజ్ లేకపోయినా.. ట్విట్టర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స

Advertiesment
Mark Zuckerberg
, సోమవారం, 28 ఆగస్టు 2017 (13:34 IST)
ప్రపంచంలోని సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ అగ్రగామి కాగా, ట్విట్టర్లు రెండో స్థానంలో వుంది. ఫేస్‌బుక్ కంటే ట్విట్టర్‌కు అంతగా క్రేజ్ లేకపోయినా.. ట్విట్టర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ వున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వున్నట్టుండి ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు బంద్ అయ్యింది.

ఇంగ్లండ్, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కాసేపు ఫేస్‌బుక్ పేజీలు ఓపెన్ కాకుండా మొరాయించాయి. దీంతో ఫేస్‌బుక్‌ యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఇంకా ఫేస్‌బుక్ ఇలా వున్నట్టుండి బంద్ కావడానికి కారణం ఏమిటని చాలామంది ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇలాంటి తరుణంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ తన ట్విట్టర్ పేజీలో బదులిచ్చారు. ఫేస్‌బుక్‌లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని.. వాటిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సరిచూస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. త్వరలో ఫేస్‌బుక్ సేవలు ప్రారంభం అవుతాయని వార్తలు ప్రచురించాడు. ఫేస్‌బుక్ చీఫ్ అయిన జుకర్ బర్గ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
 
ఇదిలా ఉంటే.. జుకర్ బర్గ్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు కావాలని డిమాండ్ పెరిగిపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమ్మాయైనా.. అబ్బాయిైనా అధ్యక్షుడు కావొచ్చు. ప్రస్తుతం జుకర్ బర్గ్‌కు 34 సంవత్సరాలు. మే నాటికి 35వ ఏట అడుగుపెడతారు. తద్వారా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను జుకర్ బర్గ్ సాధించినట్లవుతుంది. ఇప్పటికే ధనవంతుడైన జుకర్ బర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. 
 
జుకర్ కూడా తన సొంత డబ్బును వెచ్చించి అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయం అతనినే వరిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. డబ్బున్న వ్యక్తి మాత్రమే కాకుండా మీడియా బిజినెస్ అయిన ఫేస్‌బుక్ కూడా ఆయనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. తద్వారా పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవచ్చునని జుకర్ బర్గ్‌కు సలహాలొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే అమెరికా రాజకీయ విశ్లేషకులు మాత్రం హిల్లరీ క్లింటన్‌కే తదుపరి అమెరికా అధ్యక్షురాలిగా అయ్యే ఛాన్సుంటందని అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శామ్‌సంగ్ ఉపాధ్యక్షుడికి 12ఏళ్ల జైలు శిక్ష విధించమంటే.. ఐదేళ్లు ఖరారు చేశారు..