టిక్ టాక్ ఉపయోగిస్తున్నారా? ఐసిస్ వైరస్ సోకిందట.. బీ కేర్ ఫుల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (16:16 IST)
టిక్ టాక్ ఉపయోగిస్తున్నారా? అయితే ఐసిస్ అనే కొత్త వైరస్‌తో జాగ్రత్త పాటించాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో యాప్స్‌లో బాగా పాపులరైన టిక్ టాక్ ఒకటి దీన్ని 30శాతం మంది 18ఏళ్ల లోపు వారే ఉపయోగిస్తున్నారు. అలాంటి ఈ యాప్‌ను ఐసిస్ వైరస్ అంటే ఐసిస్ టెర్రరిస్టులు ఉపయోగిస్తున్నారు.

ఐసిస్‌ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తూ, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్‌ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్‌ ప్రారంభమైంది.
 
వీటిని చూసి ఉలిక్కిపడిన 'టిక్‌టాక్‌' కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ఐసిస్‌ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్‌ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్‌ ఖాతాలకు షేర్‌ అయ్యాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్‌ అయినట్లు టిక్ టాక్ యాజమాన్యం గుర్తించింది. 
 
ఈ వీడియోల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు, ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే సీన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్‌ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments