Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో కర్నాటక రాజకీయం పునరావృతం కాదు : జీవీఎల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:58 IST)
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానా రాష్ట్రంలో కర్నాటక రాజకీయాలు పునరావృతం కానివ్వబోమని బీజేపీ రాజ్యసభ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. గురువారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోగా, హర్యానా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఐదు సీట్ల దూరంలో వచ్చి ఆగిపోయింది. 
 
ఈ ఫలితాలపై జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, హర్యానాలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా కర్ణాటక తరహా పరిస్థితి రాబోదని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందన్నారు. హర్యానాలో స్థానిక పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారాయని, అందుకే ఈ తరహా ఫలితాలు వెల్లడైనట్టు తెలిపారు. 
 
మరోవైపు, మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యానా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగించాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేకపోయింది. దీంతో ఇతరులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు పంపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments