ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంపెనీ యాపిల్ కంపెనీ మరో కొత్త ఫోనును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 14 మ్యాక్స్ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. ఈ 14 సిరీస్‌లో ధర, ఫీచర్లు ఇతర వివరాలను ఆన్‍లైన్‌లో లీకయ్యాయి.
ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఆన్‌లైన్‌లో లీకైన సమాచారం మేరకు ఈ ఫోను ధర రూ.69900 (899 డాలర్లు)గా ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ కలిగివుంటుంది. ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో ధర రూ.77300 నుంచి ప్రారంభంకానుంది.
ఈ ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6జీపీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స ర్యామ్ ఇందులో ఉండనుంది.
ఈ ఫోనుకు యాపిల్ తాజా ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను అందించే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోనులో ఉండే ఫీచర్ల వివరాలు పూర్తిగా తెలియాలంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగాల్సిందే.