మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన నోకియా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు పెంచుకోవడం కోసం నోకియా ప్రయత్నిస్తూనే ఉంది. సరికొత్త స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తోంది.
నోకియా జీ సిరీస్ నుంచి నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. నోకియా జీ21 () స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు నోకియా 105, నోకియా 105+ ఫీచర్ ఫోన్లను, నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్, నోకియా గో ఇయర్‌బడ్స్+ లాంఛ్ చేసింది.
ఇక నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,050ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.
నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. డస్క్, నార్డిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. నోకియా అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనొచ్చు.
ఫీచర్స్
నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్
6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
యూనిసోక్ టీ606 ప్రాసెసర్
మైక్రోఎస్‌డీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్
నోకియా జీ21లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రోషూటర్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు వుంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.