Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెంట్ బిల్లు చుక్కలు చూపిస్తోందా? మీ స్ప్లిట్ ఏసీ గ్యాస్ లీక్‌ అయ్యే వుంటుంది, లక్షణాలేంటి?

Advertiesment
Air-Conditioners
, శుక్రవారం, 10 జూన్ 2022 (19:47 IST)
స్ప్లిట్ ఏసీ గ్యాస్ లీక్‌... ఈ సమస్య చాలామంది ఇళ్లలో ఎదురవుతుంటుంది. ఏసీ రిఫ్రిజెరాంట్ లీక్ అవుతుందంటే కరెంట్ బిల్లులు చుక్కలు చూపిస్తాయి. ఉన్నట్లుండి కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇంట్లో స్ప్లిట్ ఎసి సిస్టమ్‌లలో గ్యాస్ లీక్ అవుతుందని గ్రహించాలి. దీని లక్షణాలు ఎలా వుంటాయో చూద్దాం.
 
మీ స్ప్లిట్ ఏసీ గ్యాస్ లీక్‌ లక్షణాలు...
ఎసి సిస్టమ్ నుంచి చల్లటి గాలి రాదు.
ఇండోర్ ఎసి యూనిట్ నుండి హిస్సింగ్ శబ్దాలు వస్తాయి. 
కండెన్సర్ కాయిల్స్ ఘనీభవిస్తాయి. 
శీతలీకరణ శక్తి కోల్పోతుంది.
ఎసి యూనిట్ చల్లబరచడానికి కష్టపడి పని చేస్తుంది.
 
 
ఎయిర్ కండీషనర్ గ్యాస్ లీక్ కారణం
ఎసి ఫ్రీయాన్ లీక్‌లకు అత్యంత సాధారణమైన కారణం మెటల్ తుప్పు పట్టడం. ఐతే కండెన్సర్ కాయిల్స్ వంటి ప్రత్యేక మెటల్ భాగాలను భర్తీ చేసి లీకేజీ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఏసీ యూనిట్‌కి జరిగిన నష్టం, దాన్ని కొనుగోలు చేసిన కాలాన్ని బట్టి, ఉన్నదాన్నే రిపేర్ చేయాలా లేదంటే పూర్తిగా కొత్త ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయాలా అన్నది ఆధారపడి వుంటుంది.

 
పాత ఏసీ విషయంలో అయితే ఇండోర్ యూనిట్ కొత్తది కొనుగోలు చేయడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు చెప్తారు. ఎందుకంటే ఎసీలో రిఫ్రిజెరాంట్ లీక్‌లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అధిక స్థాయిలో రసాయన చికాకులకు గురిచేస్తాయి. ఇది హెచ్‌విఎసి సిస్టమ్‌ను కూడా దెబ్బతీస్తుంది. అందుకే ప్రావీణ్యమున్న మెకానిక్ సూచన మేరకు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది..

 
ఏసీలో గ్యాస్ లీకేజీని ఎలా అరికట్టాలి
ఏసీ గ్యాస్ లీక్‌లను ఎప్పటికీ నిరోధించలేనప్పటికీ, మీరు వాటిని కొంత కాలం పాటు ఖచ్చితంగా ఆపివేసి వుంచవచ్చు. నిపుణులు కనీసం సంవత్సరానికి ఒకసారి మీ హెచ్‌విఎసి సిస్టమ్‌లో నివారణ నిర్వహణను కలిగి ఉండాలని సిఫార్సు చేస్తారు. అంటే ఏడాదికి కనీసం రెండుసార్లు సర్వీసింగ్ చేయిస్తుండాలి. సంవత్సరం ప్రారంభ నెలల్లో సర్వీస్‌ని షెడ్యూల్ చేసుకోవాలి. తద్వారా వేసవిలో మీ ఏసీ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే... ఏసీ యూనిట్ సగటు జీవితకాలం 12 నుంచి 15 సంవత్సరాలు అని గమనించండి. కనుక కాలం తీరిపోయిన ఏసీలను అలాగే వాడుతూ సమస్య కొని తెచ్చుకునేకంటే వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థరైటిస్ తగ్గేందుకు శొంఠిని వాటితో కలిపి తీసుకుంటే...