వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు రాలడం సర్వసాధారణం. అయితే దీని వల్ల తలలో చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. దీనితో కొందరు జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తారు. ఇది జుట్టును బలోపేతం చేయడమే కాకుండా సహజమైన మెరుపును కూడా తెస్తుంది.
అయితే నూనె రాసేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. దీంతో జుట్టు మళ్లీ రాలడం ప్రారంభమవుతుంది. నూనె రాసుకున్న తర్వాత కూడా జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవాలి. మీరు తరచుగా చేసే కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం.
తరచుగా జుట్టుకు వేడి నూనె రాయడం మంచిది కాదు. ఇది మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు రాలిపోతుంది. ఇలా చేయడం వల్ల తలలో మంట కూడా వస్తుంది. సీజన్ ప్రకారం జుట్టుకు చల్లని లేదా వేడి నూనెను అప్లై చేయాలి. జుట్టుకు గోరువెచ్చని నూనె రాసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆయిల్ మసాజ్ సమయంలో ప్రజలు చేసే తప్పులలో ఒకటి జుట్టును బలంగా రుద్దడం. ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలిపోతుంది. జుట్టును గట్టిగా లాగడం మంచిది కాదు. జుట్టుకు నూనె రాసేటప్పుడు తేలికగా మసాజ్ చేస్తే సరిపోతుంది.
నూనె రాసుకున్న తర్వాత కొంత సమయం తర్వాత జుట్టుకు షాంపూతో తలస్నానం చేయాలి. కానీ చాలామంది ఆయిల్ రాసుకున్న తర్వాత గంటల తరబడి జుట్టు వదిలేస్తారు. దీని వల్ల జుట్టులో నూనె పేరుకుపోతుంది. చుండ్రు ఏర్పడటం ప్రారంభమవుతుంది. జుట్టు రాలడానికి చుండ్రు ప్రధాన కారణం.