Publish Date: Wed, 29 Dec 2021 (22:56 IST)
Updated Date: Wed, 29 Dec 2021 (22:59 IST)
శీతాకాలంలో చుండ్రు సమస్య మరింత వేధిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. చుండ్రు సమస్య నివారణకు రోజు మార్చి రోజు తల స్నానం చేయాలి. షాంపూ వాడకం తగ్గించి, శీకాయపొడి, కుంకుడుకాయలను వాడాలి. ఇతరుల దువ్వెనలు, టవల్స్‌ని తలకు వాడకూడదు. వేప ఆకులు, మెంతి, పెసర పొడులు మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.
ఉసిరిపొడి కొబ్బరినూనెలో కలుపుకుని తలకు రాసుకోవచ్చు. చుండ్రు తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే దాని నుండి ఇతర చర్మరోగాలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.