భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సేల్ జూలై 28న (మంగళవారం) ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. గతేడాది రిలీజ్ అయిన ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 3 ప్లస్ అప్‌గ్రేడ్ వర్షన్. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ వేవ్, వైలెట్ రంగుల్లో లభిస్తుంది.
కేవలం 3జీబీ+32జీబీ వేరియంట్ మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.7,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.