ప్రముఖ మొబైల్ శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఎలాక్సీ ఎం01 కోర్ పేరుతో సోమవారం భారత మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 5,499, రూ. 6,499 రెండు వేరియంట్లలో ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని శాంసంగ్ స్టోర్లు, ఈ-కామర్స్‌లో అందిస్తామని తెలిపింది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో దీన్ని లాంచ్ చేశారు.
నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. జూలై 29 నుంచి ఆన్‌లైన్ మార్కెట్లోనూ విక్రయాలు జరపనున్నారు. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని ఆ సంస్థ పేర్కొంది. ఎంఒన్ కోర్ 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.5,499లకు, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.6,499 ధరకు విక్రయిస్తున్నారు.
ఫీచర్లు ఇవే :
స్కీన్ : 5.3 ఇంచులు
కెమెరా : 8 ఎంపీ
ర్యామ్ : 1 జీబీ, 2 జీబీ
సెల్ఫీ కెమెరా : 5 ఎంపీ
బ్యాటరీ : 3000 ఎంఏహెచ్
స్టోరేజీ : 16 జీబీ, 32 జీబీ
ప్రాసెసర్ : క్వాడ్‌కోర్ మీడియాటెక్
రిజల్యూషన్ : హెచ్డీ ప్లస్