Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌ Vs కేంద్ర ప్రభుత్వం.. గెలుపు ఎవరిది?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:00 IST)
ట్రాక్టర్‌ ర్యాలీలో తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో.. కేంద్రం గతంలో రైతులకు సంబంధించి గతంలో 250 ఖాతాలను తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్‌ సానుభూతిపరులతో, పాకిస్థాన్‌ మద్దతు కలిగి వుందని ఆరోపిస్తూ.. రైతుల నిరసనకు సంబంధించిన 1200 ఖాతాలపై వేటు వేయాలంటూ కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల దృష్ట్యా విదేశాల నుండి పనిచేస్తున్న ఈ సంస్థల ట్వీట్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రైతు నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విటర్‌ ఇంకా ఈ ఉత్తర్వులపై స్పందించలేదని, ఫిబ్రవరి 4న ఈ జాబితాను కంపెనీకి అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ సిఇఒ జాక్‌డోర్సే నిరసనకు మద్దతు ఇచ్చిన కొన్ని ట్వీట్లకు మద్దతు తెలపడంతో .. ఖాతాలను తొలగించకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తటస్థ వైఖరిపై ట్విటర్‌ ప్రభుత్వం నుండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments